పేదలకు డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తాం
కామారెడ్డి టౌన్: సమగ్ర సర్వే పూర్తయిన అనంతరం అర్హులైన నిరుపేదలకు డిజిటల్ హెల్త్ కార్డులను అందించి రూ.10 లక్షల వరకు నిమ్స్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందిస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 76 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందన్నారు.
కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): రైతులు వరి ధాన్యాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని సింగిల్ విండో చైర్మన్, డీసీఎంఎస్ డైరెక్టర్ నల్లవెల్లి కపిల్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఎర్రాపహాడ్‌లో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. కొ నుగోలు కేంద్రాలలో అన్నిరకాల వసతులను కల్పించాలని సిబ్బందిని హెచ్చరించారు.
ఏరియా ఆస్పత్రిని
సందర్శించిన విద్యార్థులు
బాన్సువాడ రూరల్: కొత్తబాది గ్రామానికి చెందిన మోడల్‌స్కూల్ ఒకేషనల్ విద్యార్థులు బుధవారం బాన్సువాడలోని మాతాశిశు ఏరి యా ఆస్పత్రిని సందర్శించారు. ఉపాధ్యాయు లు లక్ష్మణ్‌సింగ్, సుజాత ఆధ్వర్యంలో విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణ, అంటువ్యాధులు, ప్రాథమిక చికిత్స తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో వినియోగించే వివిధ రకాల పరికరాలు, వస్తువుల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు.
పోక్సో కేసు నమోదు
దోమకొండ: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన బీబీపేట మండలంలోని జనగామకు చెందిన యువకుడిపై పోలీసులు బుధవారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కామారెడ్డి డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి యువకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment