పశువైద్య శిబిరం ప్రారంభం
బిచ్కుంద(జుక్కల్): ఖద్గాంలో బుధవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏఎంసీ వైస్ చైర్మన్ శంకర్ పటేల్ ప్రారంభించారు. గేదె, ఆవులు, మేకలు, గొర్రెలకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా శంకర్ పటేల్ మాట్లాడుతూ..పాడి రైతులు పశు వైద్యుల సలహాలు పాటించాలన్నారు. రైతులు వ్యవసాయంతో పాటు పశువులను పెంచుకోవడం వల్ల అదనపు ఆదాయం వస్తుందని, పేడను సేంద్రియ ఎరువుగా పంటల పొలాలకు వాడుకోవచ్చని తెలిపారు. ఏడీఏ భాస్కరన్, మాజీ సర్పంచ్ జీవన్, తదితరులు పాల్గొన్నారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
రాజంపేట: కొండాపూర్‌లో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారంతో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు అందరూ ఈ వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆవులు గేదెలు ఏవైనా కట్టనిచో వాటిని పరీక్షించి గర్భకోశ వ్యాధులకు తగిన చికిత్స అందిస్తామన్నారు. లింగ నిర్ధారిత వీర్యం గురించి జిల్లా పశు వైద్యాధికారి సంజయ్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ లింగ నిర్ధారిత వీర్యం వాడడం వలన 90 శాతం ఆడదూడలు జన్మిస్తాయని తెలిపారు. దీనికిగాను రైతు వాటా కింద రూ.250 చెల్లించాలని తెలిపారు. ఈవో డీఎల్‌డీఏ అబ్దుల్ మాజీద్ , పశువైద్యాధికారులు రవి కిరణ్, రమేష్, డీఎల్‌డీఏ సూపర్వైజర్ కృష్ణ, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment