ఉచిత కంటి వైద్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

ఉచిత కంటి వైద్య శిబిరం

Published Thu, Nov 21 2024 1:00 AM | Last Updated on Thu, Nov 21 2024 1:00 AM

ఉచిత

ఉచిత కంటి వైద్య శిబిరం

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): ధర్మారావ్‌పేట్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 36 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో నలుగురికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. అధికారి బాలకిషన్‌ రావు, వైద్యుడు మారుతి బాబు, ప్రిన్సిపాల్‌ రాజిరెడ్డి పాల్గొన్నారు.

రాజంపేట: ఆరెపల్లి గ్రామంలో రాజంపేట్‌ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు వైద్యాధికారి విజయ మహాలక్ష్మి తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు తెలిపారు. 74 మందిని పరీక్షించి 27 మందికి బ్లడ్‌ శాంపుల్‌ తీసుకున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్‌ సంగీత, ల్యాబ్‌ టెక్నీషియన్‌ సంతోష్‌, సూపర్‌వైజర్‌ మహ్మద్‌ మంజూర్‌, గంగామణి, ఏఎన్‌ఎం చంద్రకళ, రజిత, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిలో ఫిజియోథెరపి శిబిరం

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి పట్టణంలోని భవిత కార్యాలయంలో బుధవారం ఫిజియోథెరపి శిబిరం నిర్వహించారు. దివ్యాంగ చిన్నారులకు ఫిజియోథెరపి వైద్యులు అరుణ్‌ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి ఫిజియోథెరపీకి సంబంధించిన వ్యాయామాలు చేయించారు. సిబ్బంది వెంకటేశం తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఉచిత కంటి వైద్య శిబిరం 1
1/2

ఉచిత కంటి వైద్య శిబిరం

ఉచిత కంటి వైద్య శిబిరం 2
2/2

ఉచిత కంటి వైద్య శిబిరం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement