కొనుగోలు కేంద్రాల పరిశీలన
లింగంపేట(ఎల్లారెడ్డి): ముస్తాపూర్, కన్నాపూర్, పొల్కంపేట, మాలోత్ సంగ్యానాయక్తండా, భవానీపేట గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఐకేపీ డీపీఎం రమేశ్‌బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వివరాలను వెంటవెంటనే ట్యాబ్‌లో నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. డబ్బులు రైతుల ఖాతాల్లో తొందరగా జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు. తేమ శాతం 17 లోపు ఉన్న వడ్లను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఆయన వెంట ఏపీఎం శ్రీనివాస్, సీసీలు, వీవోలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment