ఆస్పత్రి తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి తనిఖీ

Published Thu, Nov 21 2024 1:00 AM | Last Updated on Thu, Nov 21 2024 1:00 AM

ఆస్పత

ఆస్పత్రి తనిఖీ

తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎర్రాపహాడ్‌ పీహెచ్‌సీని బుధవారం ఎంపీడీవో సయ్యద్‌ సాజీద్‌అలీ తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఎంత మంది రోగులు ఉన్నారు.. అన్ని రోగాలకు సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయా లేవా అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలన్నారు. లేకుంటే శాఖాపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు.

నిత్యాన్నదానం కోసం విరాళం

బాన్సువాడ : బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో కొనసాగు తున్న నిత్యాన్నదానం కోసం పట్టణానికి చెందిన వ్యాపార వేత్త ఉప్పరి లక్ష్మి–కాశీనాథ్‌ దంపతులు రూ. 25 వేల 116లను విరాళంగా ట్రస్ట్‌ సభ్యులు శంకర్‌ గురుస్వామికి అందజేశారు. ఉప్పరి సాయిలు–విఠమ్మల జ్ఞాపకార్థం నిత్య అన్నదానం కోసం విరాళం అందజేసినట్లు దాత కాశీనాథ్‌ తెలిపారు. ఆలయ ట్రస్ట్‌ సభ్యులు వారిని సన్మానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆస్పత్రి తనిఖీ 
1
1/1

ఆస్పత్రి తనిఖీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement