పక్కాగా సర్వే చేయాలి
సదాశివనగర్: సమగ్ర కుటుంబ సర్వేను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం మండల కేంద్రంలో కుటుంబ సర్వేతో పాటు మండల పరిషత్‌లో చేపట్టిన డాటా ఎంట్రీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రతి వ్యక్తి, ప్రతి అంశానికి సంబంధించి సేకరించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. డాటా నమోదులో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను సందర్శించి నిర్వహణ తీరును తెలుసుకున్నారు. కుప్రియాల్‌కు వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో చందర్ నాయక్, ఎంపీడీవో సంతోష్‌కుమార్, తహసీల్దార్ గంగాసాగర్, అంగన్వాడీ సూపర్వైజర్ పద్మ, ఏపీఎం రాజిరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, బీరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment