కామారెడ్డి టౌన్: కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అడ్డుపడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే తీరుతోనే అన్ని వసతులున్న నియోజకవర్గానికి రావాల్సిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జుక్కల్‌కు తరలిపోయిందన్నారు. రాష్ట్రంలో 13 నర్సింగ్ కళాశాలలు మంజూరు కాగా అందులో ఒక్కటీ కామారెడ్డికి దక్కకపోవడానికి ఎమ్మెల్యే వైఖరే కారణమన్నారు. ఇతర నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్‌చార్జీలతో కలిసి అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటే ఇక్కడ మాత్రం భిన్నంగా ఉందన్నారు. ప్రొటోకాల్ పేరిట రాద్ధాంతం చేయడం సరికాదని ఎమ్మెల్యేకు సూచించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సొంత మేనిఫెస్టో ఏమైందని ప్రశ్నించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, నాయకులు భీంరెడ్డి, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, కారంగుల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment