ఇబ్బందులు లేకుండా చూస్తాం
దోమకొండ: సీతారాంపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన కేజీబీవీని సందర్శించారు. ప్రిన్సిపల్ మంగమ్మతో మాట్లాడి శుక్రవారం విద్యార్థినుల ఆందోళనకు కారణాలు తెలుసుకున్నారు. బీబీపేట కేజీబీవీ నుంచి తాత్కాలిక పద్ధతిలో ఇక్కడికి వచ్చిన ఎస్వో మంగమ్మ, అటెండర్, ఇద్దరు కుక్‌లను తిరిగి బీబీపేట పంపించాలని విద్యార్థినులు ఎమ్మెల్యేను కోరారు. గతంలో ఇక్కడ పనిచేసిన వారిని తిరిగి రప్పించాలన్నారు. ఈ విషయంపై కలెక్టర్, డీఈవోలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన వెంట జీసీడీవో సుకన్య, మండల విద్యాధికారి విజయ్‌కుమార్ తదితరులున్నారు.
ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment