మహిళలు ఆర్థికంగా ఎదగాలి
కామారెడ్డి క్రైం : మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఎంపీ సురేశ్ షెట్కార్ సూచించారు. ఇందిర మహిళా శక్తి ప్రోగ్రాంలో భాగంగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం పక్కన మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేశారు. దీనిని శనివారం ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● ఎంపీ సురేశ్ షెట్కార్
● మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment