మద్నూర్‌కు ఇంటిగ్రేటెడ్ స్కూల్
మద్నూర్ : మద్నూర్‌కు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరయ్యిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తెలిపారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కా ర్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సోమ లింగాల గుట్ట సమీపంలో 20 ఎకరాల ప్రభుత్వ స్థ లాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ఎంపిక చేశామన్నారు. వచ్చే నెల పదో తేదీలోపు ఇంటిగ్రేటెడ్ స్కూ ల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామన్నారు. మద్నూ ర్ నుంచి సోమలింగాల గుట్ట మీదుగా హండెకేలూ ర్ గ్రామం వరకు నూతన రోడ్డు వేస్తామన్నారు. ని యోజకవర్గంలో స్పోర్ట్స్ స్కూల్, అగ్రికల్చర్ పాలి టెక్నిక్ కళాశాలల ఏర్పాటుకోసం కూడా కృషి చేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్, బిచ్కుంద, మద్నూర్‌లను మున్సిపాలిటీలుగా చేయడానికి కృషి చేస్తానన్నారు. మద్నూర్‌లో కాంట్రాక్టర్ స్పందించకపోవడంతో సెంట్రల్ లైటింగ్ ప నులు ప్రారంభం కాలేదన్నారు. త్వరలో కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తామన్నారు. వచ్చే సంవత్సరం నాటికి మద్నూర్ మండలం లెండి ప్రాజెక్ట్ నీటితో సస్యశామలం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇంటగ్రేటెడ్ స్కూల్ మంజూరు చే యించిన ఎమ్మెల్యేను మద్నూర్ వ్యాపారులు సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిలు, నాయకులు హన్మండ్లు స్వామి, రాంపటేల్, సంతోష్ మేస్త్రి, విఠల్ గురూజీ, రమేశ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
త్వరలో స్పోర్ట్స్ స్కూల్, అగ్రికల్చర్
పాలిటెక్నిక్ కళాశాల కూడా వస్తాయి
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
Comments
Please login to add a commentAdd a comment