‘డెయిరీ ఎంటెక్ కోర్సు కోసం కృషి చేస్తా’
కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాలలో ఎంటెక్ కోర్సు కోసం తన వంతు సహకారం అందిస్తానని తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శరత్‌చంద్ర పేర్కొన్నారు. కామారెడ్డి డెయిరీ కళాశాల డీన్‌గా పనిచేసి గత నెలలో ప్రమోషన్ పొందిన శరత్‌చంద్ర రిజిస్ట్రార్ హోదా లో శనివారం కళాశాలను సందర్శించారు. ఆయనను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు సన్మానించారు. ఈ సందర్భంగా శరత్‌చంద్ర మాట్లాడుతూ డెయిరీ ఎంటెక్ కోర్సు ప్రారంభించడానికి కామారెడ్డి కళాశాలకు అన్ని అర్హతలున్నాయన్నారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ కేఎస్ ఉమాపతి, అధ్యాపకులు రవీందర్‌రెడ్డి, స్వర్ణలత, మాధవి, శ్రీనివాస్, శైలజ తదితరులు పాల్గొన్నారు.
రెజ్లింగ్‌లో రజత పతకం
పెద్దకొడప్‌గల్ : జా తీయ రెజ్లింగ్ చాంపి యన్‌షిప్‌లో పెద్దకొడప్‌గల్ ఎస్సీ గురుకుల విద్యార్థి సత్తా చాటారు. అండర్– 15 కేటగిరిలో విద్యార్థిని లావణ్య రజత పత కం సాధించిందని పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ సునీత తెలిపారు. విద్యార్థినితో పాటు అకడమిక్ కోచ్ దాసరి ప్రయాంక, పీఈటీలు సుష్మ, జ్యోతిలను ఆమె అభినందించారు.
డాటా ఎంట్రీ పరిశీలన
తాడ్వాయి : మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న సర్వే డాటా ఎంట్రీ కార్యక్రమాన్ని శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రోగ్రాం రాష్ట్ర స్పెషల్ ఆఫీసర్ దీప్తి పరిశీలించారు. ఎన్యుమరేటర్లతో మాట్లాడి సర్వే, డాటా ఎంట్రీ తీరును తెలుసుకున్నారు. తప్పులు లేకుండా డాటా ఎంట్రీ జరిగేలా చూడాలని సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి రాజారాం, ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ, ఎంపీవో సవితారెడ్డి, ఎంఈవో రామస్వామి ఉన్నారు.
‘కౌలాస్’లో చేప పిల్లల విడుదల
నిజాంసాగర్(జుక్కల్) : జుక్కల్ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టులో శనివారం మత్స్యశాఖ ఆధ్యర్యంలో చేప పిల్లలను విడుదల చేశారు. ప్రాజెక్టులో 4.98 లక్షల చేప పిల్లలను విడుదల చేశామని ఎఫ్‌డీవో డోలి సింగ్ తెలిపారు. కార్యక్రమంలో మత్స్య సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఫీల్డ్‌మన్ సురేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
చెరుకు క్రషింగ్
సదాశివనగర్ : అడ్లూర్‌ఎల్లారెడ్డిలోని గాయ త్రి షుగర్స్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ కొనసాగుతోంది. శునివారం నాటికి 30,894 ట న్నుల చెరుకు క్రషింగ్ చేశామని ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావు తెలిపారు. పర్మిట్ల ఆధారంగా చెరుకును గానుగకు తరలిస్తున్నామన్నారు.
ఎమ్మెల్సీ ఓటరు
జాబితా డ్రాఫ్ట్ విడుదల
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పట్టభద్రులు, ఉ పాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించిన ఓ టరు జాబితా ముసాయిదాను శనివారం వి డుదల చేశారు. కామారెడ్డి జిల్లాలోని 25 మండలాల్లో 29 పోలింగ్ బూత్‌ల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్లు 13,993 మంది ఉన్నా రు. ఇందులో 9,961 మంది పురుషులు, 4,032 మంది సీ్త్రలు ఉన్నారు. అలాగే ఉపా ధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 25 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 1,975 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో 1,280 మంది పు రుషులు, 695 మంది సీ్త్రలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment