రెచ్చిపోతున్న దొంగలు
కామారెడ్డి క్రైం: ఉమ్మడి జిల్లా పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్నారు. గడిచిన పది రోజుల వ్యవధిలోనే ఉమ్మడి జిల్లా పరిధిలో పలు వరుస చోరీ ఘటనలు వెలుగు చూశాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముహూర్తాలు ఉండటంతో పది రోజులుగా శుభకార్యాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. దీంతో బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు హాజరు కావడానికి చాలా మంది ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా వెళ్తున్నారు. ఇదే అదనుగా దొంగలు కాలనీల్లో రెక్కి నిర్వహిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
నిఘా కరువు..
జిల్లాలో కూలీల కొరత తీవ్రం కావడంతో పట్టణ ప్రాంతాల్లోని అనేక వ్యాపార రంగాల్లో బయట రాష్ట్రాలకు చెందిన కూలీలు వచ్చి పని చేస్తున్నారు. యూపీ, బిహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన కూలీల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. వారంతా పట్టణాల్లోని శివారు ప్రాంతాలు, కాలనీల్లో నివాసం ఉంటున్నారు. ఖాళీ సమయాల్లో అన్ని చోట్ల కనిపిస్తుంటారు. దీంతో అనుమానాస్పద వ్యక్తులపై నిఘా లోపిస్తుంది. ఎవరు సామాన్యులు, ఎవరు దొంగతనాలు చేయడానికి గస్తీ నిర్వహిస్తున్నవారో అర్థం కాని పరిస్ధితి. పట్టణ ప్రాంతాల్లో బ్లూకోల్ట్ బృందాలు నిర్వహించే గస్తీ నామమాత్రంగానే సాగుతుందనే విమర్శలు ఉన్నాయి.
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం
వరుస చోరీలతో ఆందోళన
చెందుతున్న ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment