కొన్ని స్కూళ్లలో బియ్యాన్ని చెరగడం లేదు. ఉన్నది ఉన్నట్టుగానే పొయ్యిమీద వేసేస్తున్నారు. దీంతో అన్నంలో మెరిగలతో పాటు మట్టిపెళ్లలు వస్తున్నాయి. అలాగే ముక్కిపోయిన బియ్యంలో పురుగులు కూడా వస్తున్నాయి. ఒక్కోసారి అన్నం కూడా ముద్దగా మారుతుందని విద్యార్థులు చెబుతున్నారు. చాలా స్కూళ్లలో పప్పుచారు పోస్తున్నారు. కొన్ని చోట్ల కూరగాయలు, ఆకు కూరలు ఉడికించి పలచగా చేసి పెడుతున్నారు. నీళ్ల చారైనా అందులో ఇతర దినుసులు వేయకపోవడంతో విద్యార్థులు తినలేకపోతున్నారు. భోజనం రుచికరంగా ఉండటం లేదని కొందరు విద్యార్థులు ఇళ్లనుంచే బాక్సులు తెచ్చుకుంటున్నారు. తాడ్వాయి మండలం నందివాడ ప్రాథమిక పాఠశాలలో కొందరు పిల్లలు ఇంటి నుంచే కర్రీ తెచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment