బయట పడుతున్న ఎమ్మెల్యే అక్రమాలు
● మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే
బిచ్కుంద(జుక్కల్): జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అవినీతి, అక్రమాలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే బయట పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే అన్నారు. గురువారం ఆయన బిచ్కుందలో మాట్లాడారు. ఏఎంసీ చైర్మన్ల పదవులు ఇవ్వడానికి ఎమ్మెల్యే రూ.లక్షలు డిమాండ్ చేసినట్లు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే గాంధీ భవన్‌లో ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. లక్ష్మీకాంతారావు ఫేక్ ఎస్సీ సర్టిఫికెట్‌తో ఎన్నికల్లో పోటీ చేశారని సింధే ఆరోపించా రు. ఎమ్మెల్యే స్కూల్, కళాశాలల రికార్డులు, సర్టిఫికెట్లలో బీసీ అని ఉందన్నారు. దీనిపై జనవరిలో అన్ని ఆధారాలతో కోర్టులో పిటిషన్ వేసినట్లు చెప్పారు. శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించే దీక్ష దివస్‌లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వెంకట్‌రావు, బాలాజీ, సంజీవ్ పటేల్, మైపత్ హన్మాండ్లు, రాంచందర్, మహేష్, బీ లక్ష్మణ్, డాక్టర్ రాజు, పవన్ పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్ కోసం కెపాసిటర్ బ్యాంకులు
కామారెడ్డి అర్బన్: జిల్లాలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి సుమారు రూ.రెండు కోట్ల వ్యయంతో తొమ్మిది సబ్‌స్టేషన్లలో కెపాసిటర్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసినట్టు ఎస్‌ఈ నీల శ్రావణ్‌కుమార్ తెలిపారు. జిల్లాలోని ఇసాయిపేట, ఫరీద్‌పేట, దోమకొండ, జంగంపల్లి, లింగంపేట్, సర్వాపూర్, పిట్లం, బిచ్కుంద, అచ్చయపేట్ 33కేవీ సబ్‌స్టేషన్లలో కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేశామన్నారు. వీటి తో లో ఓల్టేజీ సమస్యలు రాకుండా నాణ్యమైన విద్యుత్ అందుతుందని, సరఫరా అంతరాయాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
దోమకొండ: మహిళా సంఘాల ద్వారా రుణాలు పొందిన మహిళలు వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డీఆర్‌డీవో సురేందర్ సూచించారు. గురువారం దోమకొండ మండల సమాఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మహి ళా శక్తి క్యాంటీన్ భవనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సుధాకర్, రమేష్ బాబు, మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment