పోలీస్ గెస్ట్ హౌజ్ ప్రారంభం
కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని క్యాసంపల్లి వద్ద నూతనంగా నిర్మించిన పోలీస్ గెస్ట్ హౌజ్‌ను డీజీపీ జితేందర్ ఆదివారం ప్రారంభించారు. ముందుగా కామారెడ్డికి విచ్చేసిన డీజీపీకి ఎస్పీ సింధు శర్మ, ఏఎస్పీ చైతన్యారెడ్డి, అదనపు ఎస్పీ నరసింహారెడ్డిలు స్వాగతం పలికారు. గెస్ట్ హౌజ్ ఏర్పాటులో విశేషంగా కృషి చేసిన రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు, సిబ్బందిని డీజీపీ అభినందించారు. వారిని జ్ఞాపికలతో సత్కరించారు. మల్టీజోన్ ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాసులు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment