నేడు మెగా యోగా శిబిరం ప్రారంభం
కామారెడ్డి అర్బన్: భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే మెగా యోగా శిబిరం శనివారం ప్రా రంభం కానుంది. జిల్లాకేంద్రంలోని జయశంకర్ కాలనీలోగల ప్రొబెల్స్ హైస్కూల్‌లో మూడు రోజుల పాటు రోజూ ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు శిబిరం కొనసాగనుంది. హరిద్వార్‌లోని ప తంజలి యోగా విశ్వవిద్యాలయం డీన్ డాక్ట ర్ స్వామి పరమార్థదేవ్ మూడు రోజుల పా టు శిబిరంలో అందుబాటులో ఉండి, యో గా తరగతులు నిర్వహిస్తారని జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి, ప్రతినిధి అంజయ్య తెలిపారు. యోగా తరగతులతోపాటు ఆధ్యాత్మిక, దేశభక్తి, స్వదేశీ వంటి అంశాలపై ఆయన ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఆయన జిల్లాకేంద్రంలోని ఆర్‌కే, సాందీపని, శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్ విద్యార్థులతో వేరువేరుగా ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు.
పీజీ పరీక్షలు ప్రారంభం
భిక్కనూరు : తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో పీజీ మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ పరీక్షలను పరిశీలించారు. ఉదయం సెషన్‌లో నిర్వహించిన మొదటి సెమిస్టర్ పరీక్షలకు 169 మంది విద్యార్థులకుగాను 162 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన మూడో సెమిస్టర్ పరీక్షలకు 159 మంది హాజరు కావాల్సి ఉండగా 155 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు.
కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని లయో లా హైస్కూల్‌లో శుక్రవారం జిల్లా కబడ్డీ పు రుషుల జట్టును ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్‌గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 4నుంచి ఆదిలాబా ద్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీ లో జిల్లా జట్టు పాల్గొంటుందన్నారు.
జట్టు వివరాలు:
వి.రవికుమార్, హెచ్.వంశి, పి.సందీప్‌కుమార్, డి.నవీన్, విష్ణువర్ధన్‌రావు, ఆంజనేయులు, యు.అజయ్‌కుమార్, శివస్వామి, ఎస్.అజయ్‌కుమార్, కె.అభిలాష్‌గౌడ్, ఎస్.శ్రావణ్‌రెడ్డి, ఆర్.నాగశ్రీనివాస్. స్టాండ్ బైగా ఎం.విఠల్, ఎం.పవన్.
ఆంగ్ల ఉపన్యాస పోటీలో జిల్లా
విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(ఎల్టా) ఆధ్వర్యంలో శుక్రవారం హైదారాబాద్‌లో నిర్వహించిన ఇంగ్లిష్ ఎలక్యూషన్ కాంపిటీషన్‌లో జిల్లా వి ద్యార్థి ప్రతిభ చూపింది. కామారెడ్డి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సనా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి, ఉ పాధ్యాయులు అభినందించారు.
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయానికి అనుకూలంగా లేని బీడు భూముల్లో రైతులు సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేసి 25 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 4 ఎకరాల వరకు భూమి అవసరం అవుతుందని తెలిపారు. 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం వరకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఆసక్తిగలవారు ఈనెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు రెడ్‌కో వెబ్‌సైట్‌లోగాని 63049 03933, 90005 50974 నంబర్లలోగాని సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment