‘చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి’
భిక్కనూరు: ప్రతి రైతు సాగు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి నాగరాణి సూచించారు. శుక్రవారం భిక్కనూరు రైతు వేదికలో న్యాయ చైత న్య సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి పాల్గొని రైతులకు అసైన్‌మెంట్ భూములు, విత్తనాలు, విద్యుత్, మార్కెటింగ్ వంటి చట్టాల గురించి వివరించారు. రైతు విత్తనం కొనుగోలు మొదలు పంటను మార్కెట్‌లో అమ్ముకునే వరకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు న్యాయంగా రైతులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రైతు వేదికలోని అగ్రి లీగల్ క్లినిక్ రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శోభ, ఏఈవో ఆనంద్, పీఎల్వీ లు నరేష్, సంతోష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment