కామారెడ్డి టౌన్: కామారెడ్డి బల్దియాలో వి ధులు నిర్వహిస్తున్న ఫిల్టర్ బెడ్ ఆపరేటర్(ఎఫ్‌బీవో) శ్యాంపై సస్పెన్షన్ వేటు పడింది. క లెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ స్పందన ఈ చర్య తీసుకున్నారు. డిసెంబర్ 10న రాత్రి జాతీయ రహదారి పక్కనగల ఫిల్టర్ బెడ్, గడీ రోడ్‌లోని వాటర్‌ట్యాంక్, బుర్ర మత్తడి, వాటర్ వర్క్ కార్యాలయం వ ద్ద నుంచి బల్దియాకు సంబంధించిన సుమా రు రూ. 15 లక్షల విలువ చేసే పాత సామగ్రిని లారీలో తరలించిన విషయం తెలిసిందే. ఈ విషయం వెలుగులోకి రావడంతో అదన పు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి విచారణ జరిపారు. దీనికి ఎఫ్‌బీవోనే బాధ్యుడని విచారణలో తేలింది. అంతేకాకుండా వాటర్‌వర్క్ కార్యాలయంలో 2022లో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 1.50 లక్షల చొప్పున తీసుకుని ఐదుగురు ఔట్ సోర్సింగ్ కార్మికులను విధుల్లో చేర్చుకున్నారని కార్మికులే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈనెల 20న అధికారులు విచారణ చేయగా నిజమేనని తేలింది. ఈ రెండు ఘట నలపై కలెక్టర్ సీరియస్ కావడంతో ఆయన ఆదేశాల మేరకు శ్యాంపై వేటు వేస్తూ మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ పాత సామగ్రిని తరలించినప్పు డు తాను అక్కడ ఉన్నది వాస్తవమేనని, కానీ ఆ సామగ్రిని అమ్ముకున్నది తాను కాదని సస్పెన్షన్‌కు గురైన శ్యాం ‘సాక్షి’తో పేర్కొన్నాడు. తాను కార్మికులనుంచి డబ్బులు తీసుకోలేదని, కొందరు కక్షపూరితంగా తనను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment