పవర్‌కట్ ప్రాంతాలు
రొమ్ము క్యాన్సర్ నిర్ధారణతో వైద్యం
కరీంనగర్‌రూరల్: క్యాన్సర్ ముందస్తు నిర్ధారణతో వైద్యం ద్వారా నియంత్రించే అవకాశముందని రో బోటిక్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జగదీశ్వర్ గౌడలు అన్నారు. కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ ఆస్పత్రిలో మంగళవారం ఉచిత రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని డీన్ డాక్టర్ ఆచంట వివేకానందతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నెల రోజుల పాటు నిర్వహించే క్యాన్సర్ నిర్ధారణ శిబిరంలో మహిళలకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రొమ్ము క్యాన్సర్‌పై వైద్యులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఏవో రాంచందర్‌రావు, డైరెక్టర్ రవీందర్‌రావు, వైద్యులు అరుణ్‌కటారి, జగన్‌మోహన్‌రావు, గీతారెడ్డితో పాటు వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
కొత్తపల్లి: కరీంనగర్‌లో విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11కేవీ బ్యాంక్‌కాలనీ ఫీడర్ పరిధిలోని బ్యాంక్‌కాలనీ, ఆల్ఫోర్స్ మెయిన్ క్యాంపస్, వావిలాలపల్లిలో కొంత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ ఎస్.నరేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment