బీఆర్‌ఎస్‌కు కుక్క కూడా ఓటేయదు..
జగిత్యాలటౌన్: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు కుక్క కూడా ఓటు వేయదని, రాష్ట్రాన్ని నాశనం చేసిన కేటీఆర్ పాదయాత్ర చేస్తే జనం తంతారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. పదేళ్ల నియంతృత్వ పాలనలో కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసిన కేటీఆర్ పాదయాత్ర కాదు తెలంగాణ మొత్తం పాకినా జనం ఓట్లు వేయబోరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలలల్లోనే రాష్ట్రాన్ని మరింత దిగజార్చుతోందని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేకనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను జాప్యం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు వ్యతిరేకంగా ఉన్నారని, రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించినా.. ఇప్పటివరకు కేంద్రాల ఏర్పాటుకే దిక్కులేదన్నారు. కల్యాణలక్ష్మి తోపాటు తులం బంగారం ఏమైందన్నారు. రాష్ట్రంలో బీజేపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో హిందూ రాజ్య స్థాపన జరగడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కులగణన పూర్తి చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ పాదయాత్ర చేస్తే జనం తంతరు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
Comments
Please login to add a commentAdd a comment