ఇదేం తకరారు
● ప్లాస్టిక్ నిషేధంలో ఇదేం విచిత్రం
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేఽధించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయగా జిల్లా కలెక్టరేట్లలోనూ తదనుగుణంగా వ్యవహరించాలని ఆదేశించింది. ఈక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి ప్లాస్టిక్‌ను వాడకూడదని అన్ని శాఖల విభాగాధిపతులకు స్పష్టంగా నిర్దేశించారు. అయితే సదరు ఆదేశాలను పాటించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం బీసీ కమిషన్ బహిరంగ విచారణ క్రమంలో తాగునీటి వసతి కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేవలం క్యాన్లను తెప్పించగా తాగేందుకు గ్లాసులు సమకూర్చలేదు. దీంతో కొందరు ప్లాస్టిక్ గ్లాసులను తీసుకొచ్చి దప్పిక తీర్చుకున్నారు. ప్లాస్టిక్ నిషేధం ఆదేశాలను అమలు చేసినట్లే చేసి తాగేందుకు ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది.
– కరీంనగర్ అర్బన్
Comments
Please login to add a commentAdd a comment