రూ.4లక్షలతో కల్వర్టు మరమ్మతు
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం ఇరుకుల్ల–చామనపల్లి రహదారిలోని ఎస్సారెస్పీ కాలువ కల్వర్టు మరమ్మతు పనులకు ప్రభుత్వం రూ.4 లక్షలు మంజూరు చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామీణ రహదారుల నిర్మాణానికి మంజూరు చేసిన నిధుల నుంచి ఆర్‌అండ్‌బీ శాఖ రెండేళ్ల క్రితం ఇరుకుల్ల–చామనపల్లి వరకు బీటీరోడ్డు నిర్మించారు. అయితే ఇరుకుల్ల శివారులోని ఎస్సారెస్పీ కాలువపై ఉన్న వంతెన కింద చిన్న పైపులను అమర్చడంతో కిందివైపు నీళ్లు సక్రమంగా రావడంలేదు. ఏడాది క్రితం పైపుల్లో చెత్త తట్టుకుని నీళ్లన్నీ పొలాల్లోకి పోవడంతో ఎస్సారెస్పీ అధికారులు జేసీబీతో స్లాబ్ పగుల కొట్టి పైపులు తొలగించారు. అయితే కల్వర్టుపై ఏర్పడిన గుంత వాహనదారుల పాలిట ప్రమాదకరంగా మారింది. ‘సాక్షి’లో పలుమార్లు కల్వర్టు మరమ్మతులో జాప్యంపై కథనాలు ప్రచురించగా స్పందించిన అధికారులు కల్వర్టు మరమ్మతు కోసం ప్రతిపాదనలు పంపించారు. ఇటీవల ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ కింద రూ.4 లక్షలు మంజూరయ్యాయి. నిర్మాణపు పనులు పొందిన కాంట్రాక్టర్ రెండు రోజుల క్రితం పనులు ప్రారంభించారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో కల్వర్టు మరమ్మతు పనులు ప్రారంభిస్తామని ఎస్సారెస్పీ డీఈ సంతోష్ తెలిపారు.నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment