నల్లబ్యాడ్జీలతో ఏఈవోల నిరసన
కరీంనగర్ అర్బన్: డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్)ను నిరసిస్తూ ఏఈవోలు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం ఐకాస పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా ఉన్న ఏఈవోలు నల్లబ్యాడ్జీలను ధరించారు. డీసీఎస్ నిర్వహణకు ఏఈవోలు సిద్ధమని కానీ సహాయకులను నియమించాలని కోరితే నాన్చివేత ధోరణి అవలంబిస్తోందని వాపోయారు. ఏఈవోలకు మద్దతుగా ఏవోలు కూడ నల్లబ్యాడ్జీలతో విధులను నిర్వహించారు. 6వేల నుంచి 10వేల ఎకరాల వరకు ఒక్క ఏఈవో సర్వే చేయడమంటే అసాధ్యమని జిల్లా ఏఈవోల సంఘం రాష్ట్ర, జిల్లా నేతలు రాంరెడ్డి, సతీష్‌రెడ్డి, రంజిత్, అఖిల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment