నిత్యం రూ.7 వేలు ఖర్చు
కరీంనగర్ టౌన్: ప్రభుత్వాస్పత్రికి ఎక్కడెక్కడి నుంచో నిరుపేదలు వైద్యం కోసం వచ్చి, ఆకలితో పస్తులుండటం గమనించాం. మిత్రులందరితో కలిసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించాం. నిత్యం రూ.7 వేల వరకు ఖర్చువుతోంది.
– సత్యానంద్, జెడ్పీ రిటైర్డ్ సూపరింటెండెంట్,
కరీంనగర్
బయటివారు కూడా వస్తారు
ఆస్పత్రిలో ప్రతీరోజు రోగులు, వారి బంధువులకు ఉదయం టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాం. మా సంస్థ సభ్యులు, ఇతరుల పుట్టిన రోజు, పెళ్లి రోజు, వారి పెద్దల వర్దంతి సందర్భంగా టిఫిన్స్ పెడుతున్నారు. రోగులే కాదు, బయటివారు కూడా ఇక్కడికి వచ్చి, టిఫిన్, భోజనం చేస్తున్నారు.
– చింతల కిషన్, లయన్స్ క్లబ్ బాధ్యుడు,
కరీంనగర్
రోగులను చూసి చలించిపోయాం
పేద రోగులు కరీంనగర్ ఆస్పత్రికి వచ్చి, ఆకలికి అల్లాడుతుండటాన్ని చూసి, చలించిపోయాం. అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. స్నేహితులు, బంధువులు, హితుల సహకారంతో గత 677 రోజులుగా అన్నదానం చేస్తున్నాం.
– రాచమల్ల ప్రసాద్, పల్లెర్ల శ్రీనివాస్,
తొడుపునూరి వేణుగోపాల్, బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి బాధ్యులు, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment