దిగొచ్చిన సీసీఐ
● యథావిధిగా పత్తి కొనుగోళ్లు
కరీంనగర్ అర్బన్: ఎట్టకేలకు సీసీఐ దిగొచ్చింది. ఎల్1, ఎల్2, ఎల్3 పేరుతో నత్తనడకన పత్తి కొనుగోళ్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక జిన్నింగ్ మిల్లు నిండాక మరో జిన్నింగ్ మిల్లులో కొనుగోలు చేస్తామంటూ సీసీఐ కొత్త నిబంధనను తెరమీదకు తేవడంతో బేళ్ల ఉత్పత్తిలో ఇబ్బందులుంటాయని జిన్నింగ్ మిల్లు యజమానులు స్పష్టం చేశారు. కొనుగోళ్లకు సహకరించమని కాటన్ అసోసియేషన్ వెల్లడించగా మార్కెట్ కార్యదర్శులు పత్తి కొనుగోళ్లు ఉండవని పత్రికా ప్రకటనలు చేసింది. ఈ క్రమంలో సోమవారం ‘పత్తి కొనుగోళ్లకు బ్రేక్’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా కలెక్టర్ పమేలా సత్పతి స్పందించారు. కొనుగోళ్లలో జాప్యంపై ఆరా తీయడంతో పాటు సీసీఐ అత్యుత్సాహాన్ని ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం. జిన్నింగ్ మిల్లులు, సీసీఐ అధికారులతో మార్కెటింగ్‌శాఖ చర్చలు జరపగా జిల్లాలో నోటిఫై చేసిన అన్ని మిల్లుల్లో సీసీఐ కొనుగోలు చేసేందుకు అంగీకరించిందని అధికారులు వివరించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి యథావిధిగా పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
అడ్తి కమీషన్ ఏజెంట్‌కు నోటీసులు
జమ్మికుంట: స్థానిక పత్తి మార్కెట్లో ధర తగ్గిస్తున్న విషయంపై ‘వేలం ఓ రేటు.. మిల్లుల్లో సపరేటు’ శీర్షిక ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైంది. స్పందించిన మార్కెట్ కార్యదర్శి మల్లేశం అడ్తి కమీషన్ ఏజెంట్‌కు నోటీసులు జారీ చేశారు. మిల్లర్లు, అడ్తి కమీషన్ ఏజెంట్లు రైతులకు నష్టం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment