జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు పోలీసుశాఖ కృషి చేస్తున్నా.. అడ్డుకట్ట పడటం లేదు. ద్విచక్ర వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతో తమ జీవితాలతో పాటు కుటుంబాలను అంధకారంలోకి నెడుతున్నారు. ముఖ్యంగా యువత వేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఖరీదైన బైక్‌లపై వేగంగా దూసుకెళ్తూ హెల్మెట్ ధరించకపోవడంతో ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 89 మంది హెల్మెట్ ధరించకుండా బైక్ డ్రైవింగ్‌చేసి ప్రమాదాలకు గురై చనిపోగా.. గత ఏడాది 102 మంది మృత్యువాతపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment