వికారాబాద్ కలెక్టర్‌పై దాడి హేయమైన చర్య
కరీంనగర్ అర్బన్: వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్‌పై దాడి హేయమైన చర్య అని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సర్వే పనుల క్రమంలో వెళ్లిన కలెక్టర్, ఇతర 20మంది అధికారులు, ఉద్యోగులపై విచక్షణ రహితంగా కర్రలతో, రాళ్లతో దాడి చేయదాన్ని కరీంనగర్ జిల్లా టీఎన్జీవోస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దాడి చేసిన వారితో పాటు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం వివిధ ప్ర భుత్వశాఖల్లో సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, ఉపాద్యక్షుడు గంగారపు రమేశ్, పట్టణ అధ్యక్షుడు సర్దార్ హర్మిందర్‌సింగ్, పాలిటెక్నిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నజీముద్దీన్ పాల్గొన్నారు.
సొంతూరుకు పంపించండి
కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వచ్చి జీవిస్తున్నారని, వారికి ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే వారి మృతదేహాలను సొంత ఊరికి తీసుకెళ్లడం లేదని, వెంటనే సొంతూరుకు పంపించే ఏర్పా టు చేయాలని కోరుతూ సోమవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా లేబర్ అధికారి రఫీకి దళిత బహుజన లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొంకూరి కై లాసం, కార్యదర్శి క్రాంతి, కన్వీనర్ అలువాల ప్రశాంత్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలస కార్మికులను యాజమాన్యాలు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, డబ్బులు ఇచ్చి శవాలను ఇక్కడే ఖననం చేస్తున్నారని తెలిపారు. వెంటనే వారిపై చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో అలు వాల శంకరయ్య, కండె కరుణాకర్ ఉన్నారు.
‘తప్పుదోవ పట్టిస్తున్న డీఈవో’
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్ డీఈవో ధర్నా నోటీసులో పేర్కొన్న చాలా డిమాండ్లు పరిష్కరించామని తప్పుడు ప్రకటన విడుదల చేసి ఉపాధ్యాయులను తప్పుదోవ పట్టిస్తున్నారని డీటీఎఫ్, టీపీటీఎఫ్ నాయకులు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. డిమాండ్లలలో ఒకటి మాత్రమే పూర్తిగా, రెండు పాక్షికంగా పరిష్కరించినట్లు తమకు తెలిసిందన్నారు. ఏ ఒక్క కాపీ తమకు అందజేయలేదని, కేవలం వాట్సాప్ ద్వారా ప్రకటన మాత్రమే పంపారని తెలిపారు. డీఈవో విడుదల చేసిన ప్రకటనను డీటీఎఫ్, టీపీటీఎఫ్ జిల్లాశాఖలు సంయుక్తంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. టీచర్ల అక్రమ సస్పెన్షన్లు, విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని, జిల్లాలోని ఉపాధ్యాయులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
15 లోపు అడ్మిషన్లు తీసుకోవాలి
హుజూరాబాద్‌రూరల్: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్లు తీసుకునేందుకు ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ఇందిరాదేవి, కో– ఆర్డినేటర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్య విభాగంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందడానికి అవకాశం ఉందని తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ట్యూషన్ ఫీజు చెల్లించాలని తెలిపారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం కళాశాలలోని అంబేడ్కర్ స్టడీసెంటర్‌లో సంప్రదించాలని కోరారు.
దరఖాస్తుల ఆహ్వానం
తిమ్మాపూర్: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకు ల విద్యాలయాల సంస్థ, కరీంనగర్ గురుకుల మహిళా వ్యవసాయ కళాశాలలో తాత్కాలిక పద్ధతిన విధులు నిర్వహించేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్లు అసోసియేట్ డీన్ నర్సింహారెడ్డి తెలిపారు. అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ అసోసియేట్ పోస్టుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ లేదా ఎంఎస్సీ (అగ్రికల్చర్) చేసి ఉండాలన్నారు. ఈనెల 15వ తేదీ లోగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment