పారిశుధ్యంపై అవగాహన కల్పించండి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: తాగునీరు, పారిశుధ్యంపై జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు, ఆస్పత్రి సిబ్బంది, మున్సిపల్ కార్మికులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లా నీరు, పారిశుధ్య మిషన్ మొదటి సమన్వయ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జరిగింది. ఏది పరిశుభ్రమైన తాగునీరో విద్యార్థులకు తెలియపరిచే విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. మిషన్ భగీరథ నీటిపై అవగాహన కల్పించాలని, క్లోరినేషన్ ప్రాధాన్యత వివరించాలన్నారు. అన్ని ఇండ్లలోనూ మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నివాస స్థలం లేని వారికి కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మించాలని తెలిపారు. ఆసుపత్రులలో వెలువడే వ్యర్థాలను వేరు చేయడంపై ఆసుపత్రి సిబ్బందికి, మునిసిపల్ కార్మికులకు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని అన్నారు. యూనిసెఫ్ సిబ్బంది ఆర్వో, మిషన్ భగీరథ, భూగర్భ జలాల ప్రాముఖ్యతను తెలిపే ప్రయోగాన్ని చేశారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment