సాగుకు కదిలి
ఉద్యోగం వదిలి..
కోడిపిల్లల ఉత్పత్తికి ఇంక్యుబేటర్
● సంతృప్తినివ్వని సాఫ్ట్‌వేర్, ఇతర ప్రైవేటు ఉద్యోగాలు ● కోళ్ల పెంపకం, వ్యవసాయం చేస్తున్న పలువురు పట్టభద్రులు
● ఈ పనుల్లోనే మజా ఉందంటున్న వైనం ● ఆదర్శం.. ఉమ్మడి జిల్లావాసులు
రామగుండం: అంతర్గాం మండలంలోని రాయదండికి చెందిన పల్లె రాజుది నిరుపేద కుటుంబం. 2016లో ఉస్మానియా క్యాంపస్‌లో ఎంకాం చదివాడు. కొన్ని నెలలపాటు ప్రైవేటు ఉద్యోగం చేశాడు. దానితో సంతృప్తి చెందలేదు. సొంతంగా ఏదైనా పని చేసి, యువతకు ఉపాధి కల్పించాలనుకున్నాడు. 2017లో స్వగ్రామంలోనే అగ్రి గ్రీన్ ఫామ్స్ పేరిట తొలుత 10 కోళ్లు, 2 పుంజులతో నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాడు. కృత్రిమంగా 2 వేల కోడిగుడ్ల నుంచి కోడిపిల్లలను ఉత్పత్తి చేసేలా ఇంక్యుబేటర్‌కు రూపకల్పన చేశాడు. తర్వాత నాటుకోడి పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాడు. 2018 నుంచి కోళ్ల ఫాంలు పెట్టుకునే రైతులను ప్రోత్సహిస్తూ శిక్షణనిస్తున్నాడు. రాజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదుసార్లు ఉత్తమ యువ పౌల్ట్రీ రైతు అవార్డులతోపాటు 3 జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నాడు. ఇప్పటివరకు దేశంలోని 19 రాష్ట్రాలకు నాటుకోడి పిల్లలు సరఫరా చేశాడు. 5 దేశాలకు నాటుకోడి పచ్చడి ఎగుమతి చేస్తున్నాడు. కడక్‌నాథ్, తెల్లరంగు చీమ, టర్కీ కోళ్లు, ఖజానా బాతులు, అమెరికన్ సిల్కీ కోళ్లు, కుందేళ్లు, అమెరికన్ జాతి పావురాలు, జర్మన్ షెఫర్డ్ కుక్కలు పెంచుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment