హామీ మేరకు పథకాల అమలు
● నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న బీఆర్‌ఎస్, బీజేపీ ● సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
కరీంనగర్ కార్పొరేషన్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పథకాలు అమలు చేస్తున్నామని సుడా చైర్మనన్, కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలో ఉచిత బస్సు పథకం కింద నెలకు 60 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని తెలిపారు. 1.56 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం డిస్కంలకు రూ.6 కోట్లు చెల్లించిందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తే, తాము రూ.5 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఆలోచన కూడా చేయని డైట్‌చార్జీలను తాము పెంచామన్నారు. నిరుద్యోగులతో బీఆర్‌ఎస్, బీజేపీ చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని, ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు చెల్లిస్తోందన్నారు. జిల్లాలో 71 వేల మందికి రైతు రుణమాఫీ జరిగిందని పేర్కొన్నారు. విపక్షాలవి అర్థం లేని విమర్శలని మండిపడ్డారు. నాయకులు సమద్ నవాబ్, కొరివి అరుణ్‌కుమార్, శ్రవణ్‌నాయక్, దండి రవీందర్, పోరండ్ల రమేశ్, షబానా మహమ్మద్, రజితా రెడ్డి పాల్గొన్నారు.
యోగా శిక్షణ ప్రారంభం
కరీంనగర్‌టౌన్: నేషనల్ ఆయుష్ మిషన్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాస్పత్రి రెండో అంతస్తులో శనివారం యోగా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్ నవీన, యునాని మెడికల్ ఆఫీసర్ యశ్రబ్‌సుల్తానా వాటిని ప్రారంభించారు. అనంతరం వైద్యులు, సిబ్బందికి యోగా శిక్షకులు అంజయ్య, అక్షయ పలు ఆసనాలు నేర్పించారు. యోగాతో దీర్ఘకాలిక రోగాలు దూరమవుతాయని, ప్రతీ ఒక్కరు సాధన చేసి, ఆరోగ్యంగా ఉండాలని సూపరింటెండెంట్ సూచించారు. డీపీఎం ప్రవీణ్‌కుమార్, ఫార్మసిస్టు మహమ్మద్ మునీర్, ఎంఎన్‌వో సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment