నిబంధనలు పట్టని లేఅవుట్
కేరళలో స్వాములు
కరీంనగర్ కార్పొరేషన్: నగరం మధ్యలో లేఅవుట్ పేరిట అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయిస్తున్న వ్యవహారం వెలుగుచూసింది. నగరపాలక సంస్థ పరిధిలోని 44వ డివిజన్ శర్మనగర్‌లో కొంతమంది ప్లాటింగ్ పేరిట విక్రయాలు సాగిస్తున్నారు. వాణిజ్య ప్రాంతమైన శర్మనగర్‌లో దాదాపు పది గుంటలకు పైగా ఖాళీ స్థలంలో ఈ ప్లాట్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. లేఅవుట్ చేస్తే నగరపాలకసంస్థ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లే అవుట్ నిబంధనల మేరకు 40 ఫీట్ల రోడ్డు తీయడంతోపాటు కొంత స్థలం ఇతర అవసరాలకు కూడా వదలాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండానే లేఅవుట్ చేసినట్లుగా మ్యాప్‌లో చూపిస్తూ మార్కెట్‌లో ప్రచారం చేస్తున్నారు. కేవలం 15 ఫీట్ల రోడ్డును మాత్రమే మ్యాప్‌లో చూపిస్తూ ప్లాటింగ్ చేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా, వాణిజ్య ప్రాంతమైన శర్మనగర్‌లో వంద రెట్లు ఎక్కువగా భూముల ధరలుంటాయి. ఇక్కడ హాస్పిటళ్లు అధికంగా ఉండడం, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి అతి సమీపంలో ఉండడంతో భూముల ధరలు రూ.కోట్లలో ఉన్నాయి. దీంతో గజం స్థలం కూడా వదిలేయడానికి స్థల యజమానులు అంగీకరించరు. ఈ క్రమంలోనే కేవలం 15 ఫీట్ల రోడ్డును మ్యాప్‌లో చూపిస్తూ, ప్లాట్లను విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ప్లాటింగ్‌ను నియంత్రించాలని, కనీసం రోడ్డును 40 ఫీట్లకు పెంచాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
నగరం నడిమధ్యలో ప్లాట్ల
పేరిట విక్రయాలు
Comments
Please login to add a commentAdd a comment