కరీంనగర్: నగరంలోని కోరా జాన్సన్ పాఠశాల విద్యార్థులు ఎడ్యుకేషనల్ టూర్‌లో భాగంగా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లోని పాల కేంద్రాన్ని సందర్శించారు. పాల ఉత్పత్తి, వాటిని శుభ్రపరిచి వేడి చేసి స్టోర్ చేసే విధానాలను అక్కడి సిబ్బంది విద్యార్థులకు వివరించారు. పాఠశాల చైర్మన్ మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు ఇలాంటి ఎడ్యుకేషన్ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చదువుపై జిజ్ఞాస కలిగిస్తుందని, పిల్లల్లో ఆలోచనాశక్తిని పెంపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వరప్రసాద్, రాంరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment