విద్యార్థుల్లోని పరిజ్ఞానం వెలికితీసేందుకే పీబీఎల్
కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థుల్లోని పరిజ్ఞానాన్ని వెలకితీయడానికి పీబీఎల్(ప్రాజెక్టు బేస్డ్ లెర్నింగ్) దోహదపడుతుందని జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ప్రఫుల్ దేశాయ్ అన్నారు. పద్మనగర్‌లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో 2023–24 విద్యాసంవత్సరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాస ప్రదర్శన ఇంటర్ పీబీఎల్ ముగింపు వేడుకలకు బుధవారం ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల ప్రాజెక్టులను తిలకించి మాట్లాడారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడానికి పారమిత చేస్తున్న ప్రయత్నం భవిష్యత్‌లో ఉపయోగపడుతుందన్నారు. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన పిల్లలను సక్రమ మార్గంలో తీర్చిదిద్దే అత్యంత ముఖ్యమైన రంగాల్లో ఒకటని, రెండు దశాబ్దాలుగా ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన విద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధిని చూపుతోందని అన్నారు. పారమిత విద్యాసంస్థల చైర్మన్ డా.ఇ.ప్రసాదరావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని మేధస్సును తెలుసుకునేందుకు ప్రతి సంవత్సరం ప్రాజెక్టు ఆధారిత అభ్యసన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 80 గ్రూపులు పాల్గొనగా.. 60 మంది విద్యార్థులతో కూడిన 12 గ్రూపులు 2023–24 సంవత్సరానికి పీబీఎల్ అవార్డు విజేతలుగా గుర్తించారన్నారు. ఉత్తమ ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్లను ప్రఫుల్ దేశాయ్ అందజేశారు. పారమిత విద్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనూకర్‌రావు, రశ్మిత, రాకేశ్, ప్రాచీ, టి.ఎస్.వి.రమణ, వినోదరావు, వి.యు.ఎం.ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ, బాలాజీ, శ్రీకర్, శర్మిష్ఠ, ప్రశాంత్, కవితాప్రసాద్, పి.బి.ఎల్. హెడ్ లలిత్ మోహన్ సాహు, పీబీఎల్ సమన్వయకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్
Comments
Please login to add a commentAdd a comment