అన్నదానం
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్‌లోని శ్రీసరస్వతి శిశుమందిర్‌లో 1988–89 సంవత్సరంలో పదోతరగతి కలిసి చదువుకున్న మిత్రుల్లో తొడుపునూరి అనిల్ ఇటీవల మరణించగా.. ఆయన స్మృతిలో బుధవారం టవర్ సర్కిల్ వద్ద అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, వంగల పవన్, తొడుపునూరి కరుణాకర్ ముఖ్య అతిథిలుగా హాజరవగా.. చిన్ననాటి మిత్రులు దారం విక్రమ్, దారం విజయ్, సుద్దాల శ్రీనివాస్, గౌరిశెట్టి అమర్, వడాల విజేందర్, బండ శ్రీనివాస్, అల్లె మధు, గర్రెపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అభినందన
కరీంనగర్‌రూరల్: గంగాధర మండలంలో మిషన్ భగీరథ ఏఈఈగా పని చేస్తున్న కోహెడ జ్ఞానేశ్వరిని బుధవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అభినందించారు. కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన గీత కార్మికుడు కోహెడ రవి–శారద దంపతుల కూతురైన జ్ఞానేశ్వరి బీటెక్ పూర్తి చేసింది. ఇటీవల ప్రకటించిన ఏఈఈ ఫలితాల్లో మిషన్ భగీరథ ఏఈఈగా ఎంపికై గంగాధర మండలంలో పని చేస్తోంది. తండ్రి రవితో కలిసి జ్ఞానేశ్వరి బుధవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యంను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛమందించి సన్మానించారు. ఇరుకుల్ల మాజీ ఉప సర్పంచ్ బుర్ర రమేశ్‌గౌడ్, కందుల సంపత్, నేదునూరి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్
బకాయిలు చెల్లించాలి
కరీంనగర్‌టౌన్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా విద్యాసంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదనే నెపంతో విద్యార్థుల సర్టిఫికెట్లిచ్చేందుకు అనేక కళాశాలలు నిరాకరిస్తున్నాయని అన్నారు. పైచదువులు చదువుకోలేని పరిస్థితుల్లో అనేకమంది విద్యార్థులున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని, లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
పోటు ప్రసాద్ మృతి తీరని లోటు
విద్యానగర్(కరీంనగర్): సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అకాల మృతి సీపీఐకి, ప్రజా ఉద్యమకారులకు తీరని లోటని సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం ఖమ్మంలో వాకింగ్ చేస్తున్న పోటు ప్రసాద్ గుండెపోటుకు గురై మృతిచెందడం అత్యంత బాధాకరమని, సీపీఐ ఒక మంచి నాయకున్ని కోల్పోయిందన్నారు. విద్యార్థి దశ నుంచే కమ్యూనిజం వైపు అడుగులు ఆయన.. ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘంలో పని చేశారని అన్నారు. ఆయన మృతిపై సీపీఐ కరీంనగర్ జిల్లా సమితి పక్షాన తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
దుప్పట్లు పంపిణీ చేయాలి
కరీంనగర్: సంక్షేమ హస్టళ్లలో ఉన్న విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట దుప్పట్లు కప్పుకొని నిరసన ప్రదర్శన చేపట్టారు. జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ.. చలికాలం ప్రారంభమై చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్నా విద్యార్థులకు కనీసం దుప్పట్లు పంపిణీ చేయాలన్న శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. సంక్షేమ హాస్టళ్లకు కనీసం దోమతెరల్లేక విద్యార్థులకు విష జ్వరాలు వస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్‌సాగర్, ఇషాక్, సహాయ కార్యదర్శులు భోగేశ్వర్, నాగుల శ్రీజ, జిల్లా కమిటీ సభ్యులు రత్నం సురేశ్, సందేశ్, రాకేశ్, గట్టు ఆకాశ్, నాయకులు సన్నీ, వంశీ, అక్షయ్, పవన్, తరుణ్, రఘు, రాకేశ్, రిజ్వన తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment