దేశం, ధర్మం కోసం పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

దేశం, ధర్మం కోసం పాటుపడాలి

Published Thu, Nov 28 2024 1:05 AM | Last Updated on Thu, Nov 28 2024 1:05 AM

దేశం, ధర్మం కోసం పాటుపడాలి

దేశం, ధర్మం కోసం పాటుపడాలి

విద్యానగర్‌(కరీంనగర్‌): సమాజంలో వస్తున్న వింత పోకడలను గమనిస్తూ స్వదేశీ ఆలోచనలను జోడించుకొని మనమంతా దేశం, ధర్మం కోసం పాటుపడాలని అఖిల భారతీయ శిక్షా సంస్థాన్‌ ప్రచార విభాగ్‌ ప్రహరీ లింగం సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం కరీంనగర్‌లోని శ్రీసరస్వతీ శిశుమందిర్‌ హైస్కూల్‌లో జరిగిన కుటుంబ ప్రబోధన్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మన దేశానికి కుటుంబ వ్యవస్థ మూలాధారమని, దాన్ని కాపాడుకోవాలన్నారు. పాఠశాల అధ్యక్షుడు బల్మూరి కరుణాకర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీసరస్వతీ విద్యాపీఠం పాలక మండలి సభ్యుడు ఎలగందుల సత్యనారాయణ, పాఠశాల కార్యదర్శి ఇంజినీర్‌ కోల అన్నారెడ్డి, సహ కార్యదర్శి కొండా గంగాధర్‌, కరీంనగర్‌ విభాగ్‌ కార్యదర్శి మేచినేని దేవేందర్‌రావు, విభాగ్‌ శైక్షనిక్‌ ప్రముఖ్‌ కాటం రవీందర్‌, కొండా గంగాధర్‌, కొలుగూరి సదాశివరెడ్డి, రాపర్తి శ్రీనివాస్‌, రాజిరెడ్డి, పాఠశాల ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement