విద్యార్థులకు అవగాహన
కరీంనగర్‌సిటీ: కరీంనగర్‌లోని విమెన్ ఎంపవర్‌మెంట్, హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆటమ్ హాస్పిటల్ డాక్టర్ శ్రీజ బద్దం హాజరయ్యారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు రుతుక్రమంలో వచ్చే సమస్యలు, పాటించాల్సిన వ్యక్తిగత శుభ్రతకు సంబంధించిన విషయాలను కూలంకషంగా వివరించారు. పీసీవోడీ సమస్యపై విద్యార్థులడిగిన ప్రశ్నలకు సమాధానాలు విపులంగా చెప్పారు. రుతుక్రమ సమస్యలు వివిధ కారణాల వల్ల వస్తున్నాయని, వాటి నుంచి ఏవిధంగా బయటపడాలో వివరించారు. విమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ బి.రజినీదేవి, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.వరలక్ష్మి, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.కల్పన, ఉపాధ్యాయునులు పాల్గొన్నారు.
మల్టీపర్పస్ పార్కుకు
కలాం పేరు పెట్టాలి
కరీంనగర్‌కార్పొరేషన్: స్మార్ట్‌సిటీలో భాగంగా సుందరీకరిస్తున్న నగరంలోని మల్టీపర్పస్ పార్కుకు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ కోరారు. బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌ని కలిసి వినతపత్రం అందజేశారు. వచ్చే సర్వసభ్య సమావేశంలో ఇందుకు సంబంధించి తీర్మానించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment