పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
● వైద్యాధికారుల సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్/ కరీంనగర్‌టౌన్ : పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్యశాఖ అధికారులు, మెడికల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొత్తం ప్రసవాల్లో 20 శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగేలా చూడాలన్నారు. హిమోగ్లోబిన్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించి, గర్భిణులకు తగిన మోతాదులో మందులు అందజేసి, రక్తహీనత నివారించాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌ఎంపీల క్లినిక్‌లను రెండు నెలలకోసారి తనిఖీ చేయాలని, ఆర్‌ఎంపీలు తమకు ఉన్న అనుమతి మేరకే వైద్యం అందించాలన్నారు. ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు గర్భిణులకు సంబంధించిన ఎల్‌ఎంపీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, అడిషనల్ డీఎంహెచ్‌వో సుజాత, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, డీటీసీవో రవీందర్, డీఐవో సాజిదా తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తాం
విద్యార్థులు పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక ప్రదేశాలపై అవగాహన కలుగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్పరెన్స్‌హాల్లో తెలంగాణ దర్శిని కార్యక్రమంలో పర్యాటక శాఖ కమిటీతో సమావేశం నిర్వహించారు. రెండో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులను పర్యాటక, చారిత్రక ప్రాంతాల సందర్శనకు తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. మొదట కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల విద్యార్థినులను విహారయాత్రలకు తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ ఐఏఎస్ అజయ్‌యాదవ్, టూరిజం ఇన్‌చార్జి రాంబాబు, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, ఆర్టీసీ ఆర్‌ఎం సుచరిత, డీఐఈవో జగన్మోహన్ రెడ్డి, ఆర్కియాలజీ ఏడీ సాగర్, గిరిజన సంక్షేమ అధికారి జనార్దన్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment