‘మహా’ గెలుపుపై బీజేపీ సంబరాలు
కరీంనగర్టౌన్: మహారాష్ట్రలో శనివారం ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంపై బీజేపీ జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లోని తెలంగాణచౌక్లో సంబరాలు నిర్వహించారు. బ్యాండ్ వాయించి, టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ కూటమి తప్పుడు ప్రచారం, కుల, మత రాజకీయాలను మహారాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారన్నారు. ఈ ఫలితాలు ఆ కూటమికి చెంపపెట్టు లాంటివని, కులగనను వ్యతిరేకించిన మారాఠా ప్రజలు ప్రధాని మోదీ ఇచ్చిన ఏక్ హైతో సేఫ్ హై నినాదానికి జై కొట్టారని పేర్కొన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకటరెడ్డి, కార్పొరేటర్లు పెద్దపెల్లి జితేందర్, శ్రీనివాస్, పవన్, రమణారెడ్డి, మీడియా కన్వీనర్ కటకం లోకేశ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్, సత్యనారాయణ రెడ్డి, ఎన్నం ప్రకాశ్, రాజిరెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, గాయత్రి, శిల్ప వేదం, వరాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment