‘అల్ఫోర్స్’లో ముందస్తు న్యూ ఇయర్
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్, కొత్తపల్లిలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ముందస్తు న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో స్కూల్లో మంగళవారం రాత్రి జరిగిన వేడుకలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. భగత్‌నగర్‌లోని అల్ఫోర్స్ ఇ–టెక్నో స్కూల్, వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్‌నెక్ట్స్, అల్ఫోర్స్ టైనీటాట్స్, అల్ఫోర్స్ బాలికల ఇ–టెక్నో స్కూల్, కిసాన్‌నగర్‌లోని అల్ఫోర్స్ పాఠశాల, అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల్లో పాత సంవత్సరానికి వీడ్కోలున, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతీ విద్యార్థి లక్ష్య సాధన కోసం కృషి చేసి, కళలను నిజం చేసుకునేందుకు ప్రయత్నించాలని చైర్మన్ సూచించారు. ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment