ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఇల్లంతకుంట(మానకొండూర్): తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఆయ న వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామానికి చెందిన జక్కుల నాగరాజు–శోభ దంపతులకు ఇద్దరు కూతు ళ్లు ఉన్నారు. పెద్దమ్మాయి అనూష(18) తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ సెకండియర్, చిన్నమ్మాయి స్థానిక హైస్కూల్లో పదోతరగతి చదువుతున్నారు. నాగరాజు ఉపాధి నిమిత్తం 4 నెలల క్రితం గల్ఫ్ వెళ్లాడు. అనూష తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో తల్లి వైద్యం చేయిస్తోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కూతురికి ఆరోగ్యం బాగా లేదని తెలిసి, గురుకులానికి వెళ్లి, ఇంటికి తీసుకొచ్చింది. గురువారం తల్లి కూలీ పనికి, చెల్లెలు పాఠశాలకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనూష ఫ్యాన్‌కు ఉరేసుకుంది. సాయంత్రం పాఠశాల నుంచి తిరిగివచ్చిన చెల్లెలు తలుపులు మూసి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా అనూష ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె ఏడుస్తూ చుట్టుపక్కల వారిని పిలవడంతో వారు వచ్చి, తలుపు పగులగొట్టి చూడగా అనూష అప్పటికే మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అనూష తండ్రి నాగరాజు గల్ఫ్ నుంచి బయలుదేరాడని, అతను వచ్చాక అంత్యక్రియలు జరుగుతాయని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment