కోతుల దాడి.. విరిగిన విద్యార్థి కాళ్లు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాకేంద్రంలోని మంకమ్మతోట ధన్గర్‌వాడీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులపై కోతులు చేశాయి. గురువారం సాయంత్రం కొంత మంది విద్యార్థులు పాఠశాలలోని రెండో అంతస్తులో ఉన్నారు. కోతుల గుంపుగా ఒక్కసారిగా వీరిపైకి చేరుకోవడంతో బెంబేలెత్తి తలోదిక్కు పారిపోయారు. కోతుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఎనిమిదో తరగతి చదువుతున్న మద్ది రఘువర్దన్ మొదటి అంతస్తు నుంచి జారి కింద పడ్డాడు. అతని రెండుకాళ్లు, వెన్నుపూస విరిగింది. పాఠశాల ఉపాధ్యాయ బృందం, 55వ డివిజన్ కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment