గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కోరుట్ల: పట్టణంలోని ఝాన్సీ రోడ్‌లో గల ఓ సినిమా థియేటర్ వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుడి వయసు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుందన్నారు. గుర్తుపట్టిన వారు కోరుట్ల సీఐ నంబర్ 87126 56820, ఎస్సై నంబర్ 87126 56820కు ఫోన్ చేయాలని సూచించారు.
ఆమె కళ్లు సజీవం
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎంప్లాయీస్ కాలనీకి చెందిన పున్నం సరళ(62) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందింది. సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు మచ్చగిరి నరహరి, ఉప్పుల మహేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ కల్వల దీప్తి కిషన్‌రెడ్డి మృతురాలి కుటుంబసభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించగా ఒప్పుకున్నారు. వరంగల్ ఎల్‌వీపీ టెక్నీషియన్ ప్రదీప్ సహకారంతో నేత్రాలను సేకరించి, హైదరాబాద్ ఎల్‌వీ ప్రసాద్ ఐ బ్యాంక్‌కు పంపించారు. సరళ భర్త రామ్‌రెడ్డి, కూతురు–అల్లుడు మంద పద్మ–ప్రవీణ్‌రెడ్డి, కుమారుడు అనిల్‌కుమార్‌లను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment