కార్గో సెంటర్ మార్చే ప్రయత్నంలో ఉన్నాం
● అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు ● ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ సురేశ్
కరీంనగర్: బస్‌స్టేషన్ ఆవరణలో కార్గో సెంటర్‌తో ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడుతున్న విషయాన్ని గమనించి, ఇతర ప్రదేశానికి మార్చేందుకు ప్రతిపాదించడం జరిగిందని, ఇన్‌గేట్ వద్ద ద్విచక్ర వాహనాలు పార్క్ చేయకుండా భద్రత సిబ్బందికి అదేశాలు ఇచ్చామని ఆర్టీసీ కరీంనగర్ అసిస్టెంట్ మేనేజర్ సురేశ్ తెలిపారు. బస్‌స్టేషన్‌లో నెలకొన్న సమస్యలను శనివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘సమస్యల ప్రాంగణం’ శీర్షికన ప్రచురించగా.. స్పందించారు. బస్‌స్టేషన్‌లో స్టాల్స్ యజమానులు ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు అమ్మితే లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు. ప్రతీ ప్లాట్‌ఫాం వద్ద తగినన్ని కుర్చీలు ఏర్పాటు చేశామని, రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ప్రయాణికులు నిలబడి ఉంటున్నారన్నారు. అద్దె బస్సుల ఓనర్ల అసోసియేషన్ పేరిట బస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న బోర్డును తొలగించామన్నారు. ఇన్‌గేట్, ఔట్‌గేట్ వద్ద భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశామని, ద్విచక్రవాహనాలు లోనికి అనుమతించడం జరగదని వెల్లడించారు. వికలాంగుల సౌకర్యార్థం వీల్‌చైర్ ఏర్పాటు చేశామని, ఎంకై ్వరీ కౌంటర్‌లో అదనపు కుర్చీలు ఉంటాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment