విస్తృత ప్రయోజనాలు
యోగా సాధన మనిషి జీవితంలో గణనీయమైన మార్పులను తీసుకువస్తుంది. ఇది కేవలం శారీరక వ్యాయామానికి మాత్రమే పరిమితం కాదు. విస్తృత ప్రయోజనాలు ఉంటాయి. ని రంతర సాధనతో ప్రశాంతత చేకూరుతుంది. తనలోని అంతరంగాన్ని చదివే దిశగా మని షిని ప్రేరేపిస్తుంది. ప్రతి ఒక్కరూ యోగా సా ధన చేయాలి. – అంజిబాబు, శిక్షకుడు
ఎన్నో ఉపయోగాలు
నిత్యం యోగా సాధనతో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు దూరమవుతాయి. వృద్ధాప్యంలో వచ్చే ఎముకలు, కీళ్ల నొప్పులను దూరంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గించి, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. రక్తపోటు తగ్గించడమే కాకుండా శరీరంలో రక్తప్రసరణ మంచిగా జరిగేలా చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. – డాక్టర్ పద్మ, జనరల్ ఫిజీషియన్, ప్రభుత్వ ఆసుపత్రి
Comments
Please login to add a commentAdd a comment