కరీంనగర్ కార్పొరేషన్: సొంత పార్టీ పెద్దలపై నోరుపారేసుకొన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజ కవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్‌కు పీసీసీ షాక్ ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యాకలా పాలకు పాల్పడుతున్నారని, గతంలో హెచ్చరించినా తీరుమార్చుకోలేదంటూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు చిన్నారెడ్డి సోమవారం షోకా జు నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, ఇలానే కొనసాగితే చర్యలు త ప్పవని హెచ్చరించింది. కాగా శ్రీనివాస్‌కు షోకాజు ఇవ్వడం ఇది రెండోసారి. గత డిసెంబర్ 18న డీసీసీ వేదికగా సమావేశం ఏర్పాటు చేసి పురుమల్ల చేసిన వ్యాఖ్యలపై పార్టీలో తీవ్ర దుమారం చెలరేగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి అనూహ్యంగా పార్టీ టికెట్ సాధించుకున్న పురుమల్ల, ఎన్నికల్లో ఓటమి తర్వాత తనకు పార్టీ నేతలు సహకరించ లేదని అప్పట్లోనే పలువురు నగర నేతలపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే అసలు ఎన్నికల్లో ఆయనే ప్రచారం చేయలేదని తిరిగి ఆ నేతలు పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారించిన అధిష్టానం అప్పుడు కూడా షోకాజు నోటీసు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment