రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
● డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి
తిమ్మాపూర్(మానకొండూర్): ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి అన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో బొమ్మకల్‌లో గల లారీ అసోసియేషన్‌లో లారీ యజమానులు, డ్రైవర్లకు సోమవారం రోడ్డు భద్రత మాసోత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా డీటీవో మాట్లాడారు. లారీ డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలను డ్రైవ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని సూచించారు. మద్యం తాగి, మొబైల్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. అతి వేగం, అజాగ్రత్తగా వాహనాలను నడపడంతో అదుపు చేయలేక ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఎంవీఐలు స్రవంతి, హరిత, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment