క్రమశిక్షణతో ఉజ్వల భవిష్యత్
● సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్
కరీంనగర్‌రూరల్: విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకెళ్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వెంకటేశ్ అన్నారు. సోమవారం కరీంనగర్ మండలం దుర్శేడ్ జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. మాదక ద్రవ్యాలు సేవించేవారికి విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. మాదకద్రవ్యాలు సేవించిన, కలిగి ఉన్న కఠిన శిక్షలకు గురికావాల్సి వస్తుందని తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని సూచించారు. పాఠశాల ఆలయం లాంటిదని, కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు. కార్యక్రమంలో లీగల్ కౌన్సెలర్ మహేశ్, ఎస్సై లక్ష్మారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విధులను నిర్లక్ష్యం చేస్తే సహించం
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, విధులను నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులు, ధరణి, భూ సేకరణకు సంబంధించిన దరఖాస్తులపై సోమవారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని హాస్టళ్లను తనిఖీ చేసి సౌకర్యాలు పరిశీలించాలని మండల ప్రత్యేక అధికారులు, ఎంఈవోలకు సూచించారు. బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. లబ్ధిదారుల గుర్తింపునకు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయడంపై అధికారులను అభినందించారు. ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే పూర్తి చేయాలన్నారు. యాప్‌లో వివరాలు తప్పుగా నమోదు చేసినట్లు తేలితే సర్వే చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఈజీఎస్, ఆర్‌అండ్‌బీ, ఎస్డీఎఫ్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌వో పవన్‌కుమార్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సహకారంతోనే స్మార్ట్ సిటీ పనులు
● సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి
కరీంనగర్‌కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు ఇస్తేనే నగరంలో పెండింగ్‌లో ఉన్న స్మార్ట్ సిటీ పనులు కొనసాగుతున్నాయని సుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని మైత్రి సమావేశ మందిరంలో మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లనే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని కొంతమంది భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. మల్ట్టీపర్పస్ పార్క్, స్పోర్ట్స్ కాంప్లెక్ష్, సమీకృత మార్కెట్ నిర్మాణ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయన్నారు. గత బీఆర్‌ఎస్ నేతల అవినీతి కారణంగానే కేబుల్ బ్రిడ్జి అధ్వానంగా మారిందన్నారు. స్మార్ట్ సిటీ పనుల పేరిట జరిగిన అవినీతిపై తప్పకుండా విచారణ కొనసాగుతుందని చెప్పారు. రామకృష్ణాపూర్‌లోని అంగారక టౌన్ షిప్‌ను సుడా నిధులతో సుందరంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. సీఎం రేవంత్, ప్రభుత్వంపై కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. జిల్లాకు రూపాయి కూడా తీసుకురాని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ రైతు భరోసాపై మాట్లాడడం సిగ్గుచేట న్నారు. సమావేశంలో నాయకులు కాశెట్టి శ్రీని వాస్, మెండి చంద్రశేఖర్, కోటగిరి భూమాగౌ డ్, అర్ష మల్లేశం, ఆకుల నర్సయ్య, గంట శ్రీని వాస్, శ్రవణ్‌నాయక్, వెంకటరెడ్డి, శ్రీని వాస్‌రెడ్డి, మల్లేశం, జీడి రమేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment