ఎట్టకేలకు బియ్యం సరఫరా
కరీంనగర్ అర్బన్: ‘పండుగ పూట.. ప‘రేషన్’’, ‘బియ్యమిస్తరా.. ఇవ్వరా’ శీర్షికన ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. సంక్రాంతి నేపథ్యంలో సగానికి పైగా రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా కాకపోవడం, కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం వంటి అంశాలను ప్రస్తావించింది. వాటికి ఎట్టకేలకు పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. కరీంనగర్ ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో బియ్యాన్ని రేషన్ దుకా ణాలకు సరఫరా చేశారు. సివిల్ సప్లయ్ హమాలీలు సమ్మెలో ఉన్న విషయం విధితమే. ఈ క్రమంలో సమ్మె విరమిస్తారని యంత్రాంగం భావించగా జీవో ఇచ్చే వరకు విరమించబోమని వారు స్పష్టం చేయడంతో గుజరాత్ కూలీలతో రేషన్ దుకా ణాలకు బియ్యం పంపించారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు 8 రోజులే గడువు ఉంది. ఈ నెల 25 వరకు గడువు పెంచాలని డీలర్లు, కార్డుదారులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment