నగర అభివృద్ధిలో ప్రభుత్వం విఫలం
● కరీంనగర్‌కు ఏ మంత్రి బాధ్యులో చెప్పాలి ● ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ ప్రభుత్వానికి నగర అభివృద్ధి పట్టదా అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించారు. కరీంనగర్‌కు ఏ మంత్రి బాధ్యులో చెప్పాలని.. తాము ఆ మంత్రినే అడుగుతామన్నారు. బుధవారం నగరంలోని 12వ డివిజన్ వేంకటేశ్వరకాలనీ కమాన్‌ను ప్రారంభించారు. రూ.27 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన, 16వ డివిజన్ పద్మనగర్ వద్ద గరుడ జంక్షన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. నగర అభివృద్ధిలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గతంలో సీఎం హామీ పథకం నిధులు రూ.350 కోట్లతో పనులు చేపట్టామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిధులు నిలిపివేయడంతో పనులు ఆగిపోయాయని పేర్కొన్నారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లలో తమ మంత్రి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులపై సమీక్ష చేయాలని కలెక్టర్‌ను కోరినా చేయలేదన్నారు. కళోత్సవాలు, సినిమా విజయోత్సవాలు ఏవని ప్రశ్నించారు.
బ్రహ్మోత్సవాలున్నాయా.. లేవా?
శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఉ న్నాయో లేవో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పాలని ఎమ్మెల్యే కమలాకర్ డిమాండ్ చేశారు. పద్మనగర్‌లో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టా లని కోరారు. బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్, కార్పొరేటర్లు రాములు, శ్రీకాంత్, శ్రీనివా స్, మహేశ్, ఐలేందర్‌యాదవ్, నాయకులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment