● రోజుకు 5–6 గ్రాముల కన్నా తక్కువ ఉప్పు తీసుకోవాలి.
● కొవ్వు ఎక్కువగా ఉండే ఫుడ్ తగ్గించాలి.
● అరటిపండ్లు, ఆలివ్, డ్రైప్రూట్స్ వంటి పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
● ధూమపానం, మద్యపానం, కాఫీ మానేయాలి. రోజుకు 7–8 గంటలు నిద్ర పోవాలి.
● ప్రతీరోజు కనీసం 30 నిమిషాలు నడక, యోగా, ధ్యానం లేదా స్వల్ప వ్యాయామం చేయాలి.
షుగర్ రాకుండా ఉండాలంటే..
● చక్కెర తగ్గించి, జొన్న, రాగి, గోధుమ వంటి ధాన్యాలు తీసుకోవాలి.
● ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.
● బీన్స్, బాదం, క్యారెట్, కీరా, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి.
● అధిక బరువు డయాబెటిస్ ముప్పును పెంచుతుంది. కాబట్టి, రోజూ జాగింగ్ చేయాలి.
● కుటుంబంలో షుగర్ ఉన్నవారు ఉంటే, మిగిలిన కుటుంబసభ్యులు తమ రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్ష ద్వారా తరచూ తెలుసుకోవాలి.
● రోజులో మూడు పూటలు బాగా తినడానికి బదులు చిన్న చిన్న మొత్తాల్లో ఎక్కువసార్లు భోజనం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment